ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
రాయచోటి అర్బన్ : గత కొంతకాలంగా ఉపాధ్యాయులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఎస్టీయూ తరఫున డీఈఓ సుబ్రమణ్యంకు వినతిపత్రం సమర్పించారు. 2025 ఎస్‌ఎస్‌ఈ పరీక్షల నిర్వహణ నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగు సెలవు రోజుల్లో యాక్షన్ ప్లాన్ వంటి పనులకు మినహాయింపు ఇవ్వాలని తెలిపారు. గత సంవత్సరం 10వ తరగతి యాక్షన్ ప్లాన్ నిర్వహించిన ఉపాధ్యాయులకు సీసీఎస్ నిధులు మంజూరు చేయాలని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఈ సమస్యలను పరిగణనలోకి తీసుకుని పరిష్కారం చూపాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఎస్టీయూ అధ్యక్షుడు అంకం శివారెడ్డి, రవీంద్రనాధ్ రెడ్డి, మురళీ కుమార్, మున్వీర్ బాషా, శంకర్ రెడ్డి, సునీల్, నాగరాజు, వెంకటేశ్వర్‌రెడ్డి, అంజాద్ బాషా, అజీజుర్ రెహ్మాన్, సంఘ నాయకులు రాజారెడ్డి, రెడ్డెయ్య, ప్రదీప్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.


