
● మట్టిలో మాణిక్యాలు
పెద్దతిప్పసముద్రం: మండలంలోని కమ్మచెరువుకు చెందిన వీరిద్దరూ వరుసకు బావ, బామర్ది. చిన్ననాటి నుంచి కలసి మెలసి చదువుకున్నారు. వీరి విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ స్కూళ్లలోనే సాగింది. ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో ఇద్దరూ ఎస్జీటీలుగా ఎంపికయ్యారు. కమ్మచెరువుకు చెందిన ఎం.వేమనారాయణ, అలివేలమ్మ దంపతుల కుమారుడు నవీన్‌కుమార్ డీఎస్సీ ఫలితాల్లో 84.40 మార్కులు సాధించాడు. ఇదే గ్రామానికి చెందిన టి.గంగులప్ప, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు టి.విష్ణువర్దన్ డీఎస్సీ ఫలితాల్లో 70.20 మార్కులు సాధించాడు.
సత్తా చాటిన దంపతులు
పెద్దతిప్పసముద్రం మండలంలోని పులికల్లు పంచాయతీ బొంతలవారిపల్లికి చెందిన వెంకట్రమణారెడ్డి, సుబ్బమ్మ దంపతుల కుమారుడు బి.మధూకర్‌రెడ్డి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనతో పాటు అతని భార్య సునీత డీఎస్సీ పరీక్షలు రాశారు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో మధూకర్‌రెడ్డి 81.37 మార్కులతో జిల్లాలో 9వ ర్యాంకు సాధించి ఇటు మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్‌గా, అటు పీజీటీగా జోన్–4లో 20వ ర్యాంకు సాధించాడు. భార్య సునీత కూడా 74.62 మార్కులతో జిల్లాలోని మహిళా విభాగంలో 16వ ర్యాంకు సాధించి ఇటు సోషియల్ స్కూల్ అసిస్టెంట్‌గా, 81.05 మార్కులతో అటు ఎస్జీటీగా ఎంపికై ంది. ఒకొక్కరు రెండేసి ఉద్యోగాలకు ఎంపికై న దంపతులను బంధువులు, ఆత్మీయులు అభినందించారు.
మెరిసిన గొర్రెల కాపరి కుమారుడు
కలికిరి : కలికిరి మండలం మర్రికుంటపల్లి గ్రామం అలకంవారిపల్లికి చెందిన అలకం శివయ్య, లక్ష్మీదేవిల కుమారుడు అలకం వెంకటరమణ ఇటీవల విడుదలైన డీఎస్సీ మెరిట్ లిస్ట్‌లో 14వ ర్యాంకు సాధించి ఫిజిక్స్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు. తల్లిదండ్రులు గొర్రెలు కాపరులుగా ఉంటూ తనను చదివించారని, వారి ఆశలు వమ్ము కాకుండా కష్టపడటంతో ఉద్యోగం సాధించినట్లు వెంకటరమణ తెలిపారు.

● మట్టిలో మాణిక్యాలు

● మట్టిలో మాణిక్యాలు