
డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం
డీఎస్సీ– 2025 ఫలితాల్లో గాలివీడు విద్యార్థి పొడిదాసరి సురేష్ కుమార్ ఎస్జీటీ విభాగంలో 47 ర్యాంక్ సాధించాడు.పట్టణంలోని సలాదివాండ్లపల్లిలో ఉండే పొడిదాసరి గంగులు,అమ్ములు దంపతుల కుమారుడు సురేష్ కుమార్ కష్టపడి చదివి రెండో ప్రయత్నంలో రాణించి టీచర్ పోస్టును సాధించాడు.పదో తరగతి వరకు స్థానికంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలో చదివిన సురేష్ ఇంటర్,టీటీసీ రాయచోటిలోని ప్రభుత్వ కళాశాలల్లో పూర్తి చేశాడు.తండ్రి తిరిగిరాని లోకాలకు పోయినా, తల్లి గల్ఫ్ దేశాలకు వెళ్లి కష్టపడి తనను చదివించిందని గుర్తుకు చేసుకున్నాడు.తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఇంతటి విజయాన్ని సాధించానని చెబుతున్నాడు.
మదనపల్లె సిటీ:/ గాలివీడు: పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ –2025లో అర్హత సాధించిన ఉపాధ్యాయ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యాశాఖ సమాయత్తమైంది. ర్యాంకు సాధించిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత లాగిన్ ఐడీల ద్వారా కాల్ లెటర్లు అందుతాయని ఇదివరకే అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్‌లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు ఇటీవల తీసుకున్న కులధ్రువీకరణ పత్రం, గెజిడెట్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్ల సర్టిఫికెట్ జిరాక్స్‌లు, 5 పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకుని వారికి కేటాయించిన తేదీల్లో సర్టిపికెట్ల వెరిఫికేషన్‌కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్‌కు హాజరుకాకముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది, అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయానికి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు తప్పని సరిగా హాజరు కావాలి. అలా హాజరు కాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుందని అధికారులు స్పష్టం చేశారు.
వారెవ్వా... రవీంద్రా...!
ఆయన ఆర్మీ జవాన్. మదనపల్లె సొసైటీకాలనీకి చెందిన రవీంద్ర ప్రాథమిక, ఉన్నత, కళాశాల విద్య ప్రభుత్వ పాఠాలలు, కాలేజీలో అభ్యసించారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో ఆర్మీలో చేరారు. అక్కడ విధదులు నిర్వహిస్తూనే దూర విద్య ద్వారా డిగ్రీ,పీజీ కోర్సులు పూర్తి చేశారు. 16 సంవత్సరాలు పాటు దేశానికి సేవ చేసి రెండు సంవత్సరాల క్రితం మదనపల్లెకు చేరుకున్నాడు. ఇక్కడే ఉపాధ్యాయ విద్య బీఎడ్ పూర్తి చేశారు. అనంతరం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) రాసి ఏకంగా 138 మార్కులు సాధించాడు.గత ఏడాది విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేశారు.తనకున్న అర్హతలతో అయిదు టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారు. తిరుపతిలోని ఓ కోచింగ్ కేంద్రంలో శిక్షణ పొందారు. డీఎస్సీ పరీక్షల్లో సత్తాచాటారు. ఏకంగా అయిదు పోస్టుల్లోనూ అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ భౌతికశాస్త్రంలో 72.76 మార్కులతో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయిలో 9వ ర్యాంకు సాఽధించారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ గణితంలో 73.32 మార్కులతో 34వ ర్యాంకు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ సైన్సులో 80.75 మార్కులతో జోనల్ స్థాయిలో 88వ ర్యాంకు, టైన్డ్ గ్రాడ్యుయేట్ గణితంలో జోనల్ స్థాయిలో 62.59 మార్కులతో 180 ర్యాంకు సాధించారు. దీంతో పాటు సెకండరీ గ్రేడ్ విభాగంలో 84.11మార్కులతో114 ర్యాంకు సాధించి ప్రతిభ చాటారు. ఆయన భార్య రమాభార్గవి రామసముద్రం మండలంలోని జంగాపల్లి ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పని చేస్తున్నారు.ఆయన్ను రూటా రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్‌ఖాన్, ఎస్టీయు, యుటిఎఫ్ సంఘ నాయకులు అయూబ్‌ఖాన్, రమాదేవి, హేమలతలు అభినందించారు.