
నల్లగుట్టపై పోలీసు పహారా
మదనపల్లె రూరల్ : మండలంలోని అంకిశెట్టిపల్లె పంచాయతీ సర్వే నంబర్.15లోని నల్లగుట్టపై బుద్ధవిగ్రహాన్ని తిరిగి ప్రతిష్టిస్తామని, బౌద్ధసమ్మేళనం నిర్వహిస్తామని బాస్, దళిత సంఘర్షణ సమితి నాయకులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన నేపథ్యంలో...పోలీస్, రెవెన్యూ శాఖ నిషేధాజ్ఞలు విధించిన విషయం తెలిసిందే. శనివారం నల్లగుట్ట చుట్టూ 5 కి.మీ.ల పరిధిలో ప్రజలు గుమికూడకుండా, ఎలాంటి ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించకుండా పెద్దసంఖ్యలో పోలీసులు పహారా కాశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరించి, ద్విచక్రవాహనాలపై వెళుతున్న వారిని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ మహేంద్ర సిబ్బందితో కలిసి అంకిశెట్టిపల్లె పంచాయతీలోని నల్లగుట్ట వద్ద పరిస్థితిని సమీక్షించారు. పోలీసులకు పలుసూచనలు చేస్తూ, బందోబస్తును స్వయంగా పర్యవేక్షించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా బహుజనసేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందును టూటౌన్ సీఐ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
200 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు