
నూతన నియామకం
కడప కోటిరెడ్డిసర్కిల్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాకు చెందిన వారిని పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శులుగా నియమించారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. తంబళ్లపల్లెకు చెందిన కుమార్‌నాయుడు, పీలేరుకు చెందిన బి.రవికుమార్‌రెడ్డి, జె.రాజగోపాల్‌రెడ్డిలను నియమించారు.
నందలూరు: నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ అరవపల్లెలోని శ్రీ కృష్ణ గీతా మందిరం వద్ద శనివారం ఉదయం కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ కృష్ణుని కల్యాణం వైభవంగా జరిగింది. అనంతరం కల్యాణం లడ్డూ వేలంపాట నిర్వహించగా రూ.3 లక్షలు పలికింది. భారత పురావస్తు శాఖ మాజీ ఉద్యోగి చెంగారి రామాంజనేయులు వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నాడు.
కురబలకోట: మదనపల్లె సమీపంలో అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో నూతన నియామకాలు జరిగాయి. ఈ మేరకు చాన్స్‌లర్ డాక్టర్ ఎన్. విజయభాస్కర్ చౌదరి ప్రకటించారు. డాక్టర్ డి. ప్రదీప్‌కుమార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా, మార్పూరి ప్రతిభ అదనపు రిజి స్ట్రార్, డాక్టర్ సాయికుమార్ కంట్రోలర్ ఆఫ్ ఎక్జామినేషన్‌గా నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రో చాన్స్‌లర్ ఎన్. ద్వారకనాథ్ పాల్గొన్నారు.
కడప కోటిరెడ్డిసర్కిల్: వరుస సెలవుల నేపధ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆదివారం రాత్రి తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు నడుపుతున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ఆదివారం రాత్రి 9.10 గంటలకు ఈ రైలు (07097) తిరుపతిలో బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, యాదగిరి, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట మీదుగా సికింద్రాబాద్‌కు ఉదయం 10.00 గంటలకు చేరుతుందన్నారు. తిరిగి ఇదే రైలు (07098) సికింద్రాబాదులో సోమవారం సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరి ఇదే మార్గంలో తిరుపతికి మరుసటిరోజు ఉదయం 7.30 గంటలకు చేరుతుందన్నారు. రిజర్వేషన్ సౌకర్యం కల్పించారని, ప్రయాణకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
రాయచోటి: అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు, స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ డాక్టర్ గౌతు లచ్చన్న భావితరాలకు స్ఫూర్తి అని జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.దేశంలో సర్దార్ వల్లబాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకై క వ్యక్తి లచ్చన్న అని అన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న వీవీ గిరి, నేతాజీ సుబాష్ చంద్రబోస్ తదితర జాతీయ నాయకులతో కలిసి భారతదేశ స్వాతంత్య్ర పోరాటాలలో పాల్గొని అనేక పర్యాయాలు జైలుకు వెళ్లారన్నారు. గాంధీజీ పిలుపునకు స్పందించి స్వాతంత్య్రోద్యమంలో చేరాడన్నారు. 1930లో మహాత్మగాంధీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చారని, దీనికి ప్రభావితుడైన లచ్చన్న బారువా సమీపంలో ఉన్న సముద్రపు నీరుతో ఉప్పు తయారు చేసి విక్రయించగా వచ్చిన డబ్బుతో ఉద్యమాన్ని నడిపారన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ విజె రామకృష్ణ, ఎస్‌ఐలు ఆర్‌ఎస్‌లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

నూతన నియామకం

నూతన నియామకం