
19న ఆకేపాడుకు వైఎస్ జగన్ రాక
రాజంపేట: రాజంపేట మండలంలోని ఆకేపాడుకు ఈనెల 19న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారు. ఈనేపథ్యంలో శనివారం హెలీప్యాడ్ ఏర్పాట్లను రాజంపేట ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి పరిశీలించారు. రాజంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని నవదంపతులను ఆశీర్వదించనున్నారు.
హెలీప్యాడ్ ఏర్పాట్ల పరిశీలన
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడి రాకకు సంబంధించి హెలిప్యాడ్‌ను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పరిశీలించారు. ఆకేపాటి ఎస్టేట్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో హెలీప్యాడ్‌ను (బాలిరెడ్డిగారిపల్లె సమీపంలో) ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు, ఆకేపాటి సోదరులు పాల్గొన్నారు.

19న ఆకేపాడుకు వైఎస్ జగన్ రాక