
దేవునికడప ఆలయ జీర్ణోద్ధరణ పనులు
కడప సెవెన్‌రోడ్స్: దేవునికడప శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవాలయ జీర్ణోద్ధరణ పనులకు తిరుమల–తిరుపతి దేవస్థానం సమయాత్తమైంది. ప్రాచీన ఆలయం కావడంతో ఈ పనులు చేపట్టాలని నిర్ణయించారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి వారు, పద్మావతి అమ్మవారు, ఆండాళ్ అమ్మవారి గర్భాలయాలు, విమాన గోపురాలు, రాజగోపురం మరమ్మతు పనులు చేపడుతున్నారు. దీంతో ఆలయంలో శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి, అమ్మవార్ల మూల విరాట్‌కు బదులుగా బాలాలయంలో స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చనున్నారు. ఈనెల 18వ తేది సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమై 20వ తేది పూర్ణాహుతితో ముగుస్తారు. ఆరోజు నుంచి గర్బగుడి ఎదురుగా ఉన్న మండపంలో నిర్మించే బాలాలయంలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకోవచ్చు.
● బాలాలయ నిర్మాణ పనులు ప్రారంభం

దేవునికడప ఆలయ జీర్ణోద్ధరణ పనులు