కురబలకోట : మండలంలోని అంగళ్లు–సీటీఎం మార్గంలోని మంత్రాలయం వద్ద బుధవారం రాత్రి ట్రాక్టర్ ఢీకొనడంతో యువకుడు దుర్మరణం చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు..మండలంలోని అంగళ్లు దగ్గరున్న కనసానివారిపల్లె కాలనీకి చెందిన ఉదయ్‌కుమార్ (25) ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. బుధవారం రాత్రి మరో ఇద్దరు స్నేహితులతో కలసి సీటిఎం నుంచి స్వగ్రామానికి మోటార్ సైకిల్‌పై వస్తుండగా మంత్రాలయం వద్ద ట్రాక్టర్ ఢీకొంది. విష్ణు వర్దన్ అక్కడికక్కడే మృతి చెందగా వెంట ఉన్న ఇద్దరు గాయపడ్డారు. మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కనసానివారిపల్లెకు చెందిన వెంకటేష్, అంగళ్లు గ్రామానికి చెందిన బాబా పకృద్దీన్ గాయపడిన వారిలో ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


