రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
లక్కిరెడ్డిపల్లి : గాలివీడు మండలం, నూలివీడు శ్రీనివాసపునారానికి చెందిన ఏ.రవికుమార్ (45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు లక్కిరెడ్డిపల్లి ఎస్‌ఐ రవీంద్రబాబు తెలిపారు. మంచాలపై వైరు అల్లుకుంటూ జీవనం సాగించే రవికుమార్ ఆదివారం రాత్రి తన పని ముగించుకొని లక్కిరెడ్డిపల్లి నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా దొరిచెరువు వద్దకు రాగానే రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొని పక్కనే ఉన్న పొలాల్లో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సచివాలయానికి తాళం
ఒంటిమిట్ట : మండల పరిధిలోని సాలాబాదు సచివాలయంలో సోమవారం సచివాలయ సిబ్బంది కరువయ్యారు. సోమవారం ఉదయం 9.45 గంటలకు హాజరు వేసిన సిబ్బంది సచివాలయానికి తాళాలు వేసి కనిపించకపోయే సరికి ప్రభుత్వ సేవలకు వచ్చిన ప్రజలు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో సాలాబాదు సచివాలయం సిబ్బంది మంగళవారం ఉదయం కడప కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేసినట్లు ఒంటిమిట్ట ఎంపీడీఓ కుళాయి బాబు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


