కువైట్‌లో ఆకేపాటి జన్మదిన వేడుకలు
రాజంపేట : వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాధ్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం కువైట్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు లక్ష్మీప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో కువైట్ ఓమేరియా పార్కులో కేక్ కట్ చేశారు. వందమందికి భోజనాలనుఏర్పాటు చేశారు. కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ గల్ఫ్ కో–కన్వీనర్ గోవిందు నాగరాజు, రెడ్డి సంఘం కువైట్ అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ గల్ఫ్ అడ్వయిజర్ కమిటీ సభ్యుడు నాయని మహేశ్వరరెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ షేక్ రహ్మతుల్లా, కో–కన్వీనర్ మర్రి కళ్యాణ్, సీనియర్ నేతలు రమణారెడ్డి, నరసింహ యాదవ్, సబ్దార్, లక్కీ అజీజ్, గజ్జల నర్సారెడ్డి తదితరులు హాజరయ్యారు.


