రాష్ట్రంలో అధిక మండలాల జిల్లాగా కడప | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అధిక మండలాల జిల్లాగా కడప

Jan 1 2026 11:18 AM | Updated on Jan 1 2026 11:18 AM

రాష్ట్రంలో అధిక మండలాల జిల్లాగా కడప

రాష్ట్రంలో అధిక మండలాల జిల్లాగా కడప

రాష్ట్రంలో అధిక మండలాల జిల్లాగా కడప

కడప సెవెన్‌రోడ్స్‌: జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం చేరడంతో రాష్ట్రంలో అత్యధికంగా 40 మండలాలు ఉన్న జిల్లాగా వైఎస్సార్‌ కడప ఆవిర్భవించిందని కలెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎనిమిది నియోజకవర్గాలు, ఐదు రెవెన్యూ డివిజన్లు, 40 మండలాలు, ఒక కార్పొరేషన్‌, తొమ్మిది మున్సిపాలిటీలతో జిల్లా ఆవిర్భవించిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 20,60,054 గా ఉన్న జనాభా ఇప్పుడు 22,96,497 కు చేరిందన్నారు. మిగతా జిల్లాలతో పోలిస్తే జనాభాలో రెండవస్థానంలో నిలిచిందన్నారు. జనవరి 11, 12, 13 తేదీల్లో గండికోట ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్పీ విశ్వనాథ్‌, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ భావన పాల్గొన్నారు.

రోడ్డు భద్రతా ఆంక్షలు కఠినతరం

ప్రజల ప్రాణ భద్రత కోసం చేపడుతున్న రోడ్డు భద్రత చర్యల ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని కలెక్టర్‌ చెరుకూరి సంబందిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా రహదారుల భద్ర తా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్‌, పాటు ఎస్పీ విశ్వనాథ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పలు సూచనలు చేశారు.

నాలుగు మండలాల్లో ..

రాజంపేట: రాజంపేట డివిజన్‌లోని నాలుగు మండలాల్లో వైఎస్సార్‌ కడప నుంచి రెవెన్యూ పాలన జరగనున్నది. ఈ మేరకు బుధవారం కడప కలెక్టర్‌ శ్రీధర్‌ రాజంపేట సబ్‌కలెక్టరేట్‌లో డివిజన్‌లోని నాలుగు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో రెవిన్యూ, అభివృద్ధి అంశాలపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

కలెక్టర్‌ శ్రీధర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement