ఒంటిమిట్ట: శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి కల్యాణోత్సవం అనంతరం గజవాహనంపై కల్యాణరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. కల్యాణం అనంతరం ఉత్సవమూర్తులను రామాలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు, 9.30 గంటల నుంచి 10.30 వరకు స్వామివారు ఆలయ మాఢవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాములోరి కల్యాణోత్సవం సందర్భంగా రామాలయం భక్తులతో కిటకిటలాడింది.
కోదండరాముడి రాజసం
శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం శివధనుర్భంగాలంకారణంలో శ్రీ కోదండరాముడు రాజసం భక్తులను కనువిందు చేసింది. చెక్కభజనలు, కేరళవాయిద్యాలు, మంగళవాయిద్యాలు న డుమ స్వామివారి ఊరేగింపు కోలాహాలంగా జరిగింది. డిప్యూటీ ఈవో ప్రశాంతి, సూ పరింటెండెంట్ హనుమంతయ్య పాల్గొన్నారు.
పోలీసు ఆంక్షలతో భక్తులు ఇబ్బందులు
రాములోరి కల్యాణోత్సవ సందర్భంగా పోలీసులు అమలు చేసిన అంక్షలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒంటిమిట్ట సర్పంచ్ కత్తి సుజాత, పలువురు ప్రజా ప్రతినిధులకు వీఐపీ పాసు ఉన్నా పోలీసులు ఆంక్షలు చూపి, కల్యా ణ వేదిక వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఒంటిమిట్టలో సీఎం బస
ఒంటిమిట్టలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా సీఎంను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడారు.


