కమిషనర్లకు అధికారం
మదనపల్లె: మున్సిపాలిటీల్లోని రాజకీయ నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి వార్త చెప్పింది. ఇప్పుడున్న మున్సిపల్ కౌన్సిల్ స్థానాల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడున్న సంఖ్యకు మించి కొత్తగా కౌన్సిలర్లుగా పదవులు పొందేందుకు అవకాశం ఏర్పడింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 28 కౌన్సిల్ స్థానాలు పెరగనున్నాయి. ఈ మేరకు బుధవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ పి.సంపత్ కుమార్ ఉత్తర్వు జారీ చేశారు.
మదనపల్లె: సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ అయిన మదనపల్లెలో ఇప్పుడు 35 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం 1,36,444 మంది ఉండగా ప్రస్తుతం రెండు లక్షల చేరింది. ఇక్కడ 38,837 నివాస గహాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే మున్సిపాలిటీ జనాభా పెరగడంతో పాటు విస్తరణ జరిగింది. ఇక్కడ కొత్తగా 13 కౌన్సిల్ స్థానాలు ఉన్నాయి. దీంతో కొత్త కౌన్సిల్లో స్థానాల సంఖ్య 48కి పెరుగుతాయి.
పుంగనూరు: పుంగనూరు మున్సిపాలిటీలో ప్రస్తుతం 31 వార్డులో ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎక్కడ 54,746 మంది ఉన్నారు. ప్రస్తుతం జనాభా 63 వేలకు చేరింది. నివాస గహాల సంఖ్య 16,403 ఉండగా ఈ మధ్యకాలంలో మున్సిపల్ జనాభా పెరగడంతో పాటు విస్తరించింది. ఇప్పుడు ఇక్కడ కొత్తగా మరో ఐదు కౌన్సిల్ స్థానాలు పెరగనున్నాయి.
రాయచోటి: రాయచోటి మున్సిపాలిటిలో 34 కౌన్సిల్ వార్డులు ఉన్నాయి. ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం 90814 మంది ఉండగా ప్రస్తుతం ఈ సంఖ్య 1.27 లక్షలకు చేరింది. ఈ మున్సిపాలిటి లో జనాభాతో పాటు విస్తరించింది. ఇక్కడ ఇళ్ల సంఖ్య 33,250 ఉన్నాయి. కొత్తగా పది మున్సిపల్ వార్డులు పెరగనున్నాయి.
● మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఉత్సాహం చెబుతున్న పార్టీల నేతల సంఖ్య ఎక్కువగానే ఉంది. కౌన్సిల్ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్ల అమలు ఉండడంతో కొందరు పోటీ చేరిన పరిస్థితి నెలకొంటూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో కొన్ని వార్ఢుల సంఖ్య పెంచడం వీరిలో ఆశలు చిగురుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
జి.ఓ ప్రకారం మున్సిపాలిటీలలో సభ్యుల సంఖ్యను నిర్దిష్ట నిబంధనల మేరకు నిర్ణయించాల్సి ఉండగా, ఆ అధికారాన్ని కమిషనర్లకు అప్పగించారు. తాజాగా నిర్ణయం తీసుకుని మున్సిపాలిటీలలో వార్డుల సంఖ్యను పెంచారు. ఈ మార్పులు రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. జనాభా పెరుగుదల, పట్టణ ప్రాంతాల విస్తరణ అంశాలను పరిగణనలోకి తీసు కుని వార్డుల సంఖ్యను సవరించినట్లు పేర్కొన్నారు. చిన్న పట్టణాలు, నగర పంచాయతీలలో కూడా వార్డుల సంఖ్య 20 నుంచి 23 లేదా 28 వరకు పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పట్టణాల విస్తరణ, జనాభా పెరుగుదల, పరిపాలన సౌలభ్యం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్లు ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఈ కొత్త వార్డులతో కలిపి జరపనున్నారు.
మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య పెంచిన ప్రభుత్వం
జిల్లాలో పెరగనున్న 28 వార్డులు
కమిషనర్లకు అధికారం


