పెద్దమండ్యం: వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా చేపడుతున్న సంప్ పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ బుధవారం పరిశీలించారు. మండలంలోని కలిచెర్ల పంచాయతీ పోలేరమ్మ గుడికి సమీపంలో వాటర్‌గ్రిడ్ సంప్ పనులను ఇటీవల చేపట్టారు. గండికోట రిజర్వాయర్ నుంచి తాగునీటిని అందించేందుకు 2,350 కోట్లతో పనులు చేపడుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. సంప్ నిర్మాణం, సామర్థ్యం గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ డీఆర్‌ఈవో సతీష్, డీఈ చంద్రశేఖరరెడ్డి, తహసీల్దార్ తేజస్వి, ఎంపీడీవో శ్రీధర్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అశోక్‌కుమార్, వీఆర్‌వో ఆంజనేయులు నాయక్, విలేజ్ సర్వేయర్ కరుణాకర్, సిబ్బంది పాల్గొన్నారు.


