మాజీ ఎమ్మెల్యే ప్రసాద్‌కు కన్నీటి వీడ్కోలు
చిట్వేలి : రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి వెంకటేశ్వర ప్రసాద్‌కు బుధవారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అనారోగ్యంతో తిరుపతిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని చిట్వేలిలోని తమ స్వగృహంలో ఉంచి బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, రైల్వేకోడూరు వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి తదితరులు భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.
లారీ.. బైకు ఢీ
– వ్యక్తికి తీవ్ర గాయాలు
సిద్దవటం : మండలంలోని భాకరాపేట గ్రామ సమీపంలోని మలినేనిపట్నం కాలనీ వద్ద బుధవారం రాత్రి లారీ, బైకు ఢీకొన్న ప్రమాదంలో గంగాధరంపల్లి రెడ్డిపవన్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఏపీఎస్పీ 11వ బెటాలియన్‌లో కుక్‌గా పనిచేస్తున్న గంగాధరంపల్లె హరి కుమారుడు రెడ్డిపవన్ తన బైకులో బుధవారం రాత్రి కడప నుంచి నివాసమున్న సిద్దవటం మండలం మాధవరం–1 గ్రామానికి బయలుదేరాడు. సిద్దవటం మండలం భాకరాపేట గ్రామ సమీపంలోని మలినేనిపట్నం కాలనీ వద్దకు రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసి తిరుపతి వైపు నుంచి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో బైకు లారీ కిందికిపోయి నుజ్జు అయింది. రెడ్డిపవన్ తలకు, కుడికాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం కోసం 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న సిద్దవటం ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి విచారిస్తున్నారు.
ట్రాక్టర్ బోల్తాపడి
ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు, ఇనుపసామగ్రిని తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడి జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడిన ఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. ట్రాన్స్‌కో కార్యాలయంలో విద్యుత్ పనుల కాంట్రాక్ట్ చేస్తున్న వ్యక్తి వద్ద జార్ఖండ్‌కు చెందిన అర్జున్ ముండ్రే(23), సూలే(24) కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ సామగ్రి, పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్‌లు మండలంలోని బొమ్మనచెరువు గ్రామం టేకులపాలెంలో ఏర్పాటు చేయాల్సి ఉండగా ట్రాక్టర్‌లో వేసుకుని వెళుతున్నారు. మార్గమధ్యంలో టేకులపాలెం రోడ్డులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కూలీలుగా పనిచేస్తున్న జార్ఖండ్ యువకులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు.
తీవ్రంగా గాయపడిన అర్జున్ ముండ్రే, సూలే
మాజీ ఎమ్మెల్యే ప్రసాద్‌కు కన్నీటి వీడ్కోలు
మాజీ ఎమ్మెల్యే ప్రసాద్‌కు కన్నీటి వీడ్కోలు
మాజీ ఎమ్మెల్యే ప్రసాద్‌కు కన్నీటి వీడ్కోలు


