● ఏ పండ్లకు వాడవచ్చు..
● జామలో థైవాన్ గోవా పిందె ఏర్పడిన 20–25 రోజుల తర్వాత ఒక్కొక్క పిందెకు ఒక్కొక్క తెల్ల రంగు సంచి వాడాలి. 60 రోజు తర్వాత కాయలను కోయవచ్చు.
● దానిమ్మలో పిందె ఏర్పడ్డాక.. ఒక్కొక్క పిందెకు ఒక్కో తెల్లరంగు సంచి వాడాలి. 90 రోజుల తర్వాత కాయలను కోయాలి.
● ద్రాక్షలో గుత్తులు ఏర్పడిన 60 రోజుల తర్వాత ఒక్కో గుత్తికి ఒక్కో తెల్లరంగు సంచి వినియోగించాలి. 50 రోజుల తర్వాత గుత్తులను కోసుకోవాలి.
పురుగుల నుంచి రక్షణ: ఫ్రూట్ కవర్ వినియోగంతో మంగు, మచ్చలు, మంచుపురుగు, ముడ్డిపుచ్చు, టెంక పురుగు, మకరం, ఈగలు మొదలగు వాటిని నియంత్రించి నాణ్యమైన పండ్ల దిగుబడికి తోడ్పడుతుంది. పిందె దశలో అంటే నిమ్మకాయ, కోడిగుడ్డు పరిమాణంలో ఉన్నపుడు వాడాలి. మంచి పలక పిందెలను సంచిలో పెట్టి 3 సెంటీమీటర్ల పైన తొడిమకు, సంచికి ఉండే తీగను గాలి చొరబడకుండా కట్టాలి.


