క్రీస్తు మార్గం అనుసరణీయం
● భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే
● చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
రాయచోటి: గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శుక్రవారం జిల్లా పరిధిలోని క్యాథలిక్, ప్రొటెస్ట్ టెన్స్, మిస్వా ప్రార్థన మందిరాలు, లూథరన్, ఇండియన్, పెంతుకొస్తు, యూక్తూస్ తదితర చర్చిల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుడ్‌ఫ్రైడే సందర్భంగా జిల్లాలోని అన్ని చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మదనపల్లె, రాయచోటి, పీలేరు, రాజంపేట, కోడూరు, బి కోట, తంబళ్లపల్లి ప్రాంతాల్లోని చర్చిల్లో పాస్టర్లు, మతబోధకులు ప్రసంగిస్తూ క్రీస్తుమార్గం అనుసరణీయమని అన్నారు. ఈస్టర్ పండుగకు ముందు వచ్చే శుక్రవారం గుడ్‌ఫ్రైడే జరుపుకుంటామని మత పెద్దలు తెలిపారు.మానవాళి శాంతి కోసం రక్తం చిందించిన ఏసుక్రీస్తు ప్రేమకు ఇది ప్రతీక అన్నారు. ఏసుకు శిలువ వేసిన రోజునే పవిత్ర శుక్రవారంగా జరుపుకుంటామని తెలిపారు. పండుగ సందర్భంగా సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మానవులు చేసిన పాపాలను తను మోస్తూ సిలువపై ప్రాణాలను అర్పించి త్యాగాన్ని చాటిన ఏసును క్రైస్తవులు స్తోత్రాలతో కీర్తించారు.
క్రీస్తు మార్గం అనుసరణీయం


