ఇద్దరు యువతుల అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు యువతుల అదృశ్యం

May 10 2023 12:03 PM | Updated on May 10 2023 12:03 PM

- - Sakshi

మదనపల్లె : వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువతులు అదృశ్యమయ్యారు. మదనపల్లె పట్టణానికి చెందిన మద్దిరాల ఆంజమ్మ కుమార్తె లలిత (22) ఈ నెల 5వ తేదీన ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన చోట, బంధువుల ఇళ్లలో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్‌ సీఐ మురళీకృష్ణ తెలిపారు.

కుమార్తె ఆచూకీ కోసం ఫిర్యాదు
సిద్దవటం :
మండలంలోని పి.కొత్తపల్లె గ్రామానికి చెందిన సునీత (19) సోమవారం అదృశ్యమైనట్లు ఎస్‌ఐ తులసీ నాగప్రసాద్‌ తెలిపారు. ఈ యువతి కడప నగరంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతోంది. సోమవారం సాయంత్రం తమకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తండ్రి సుబ్బారెడ్డి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement