నేటి నుంచి
● మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు
● కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్: మన చారిత్రక వైభవం, సంస్కృతీసంప్రదాయాలకు దర్పణం పట్టే గండికోట ఉత్సవాలకు అందరూ కుటుంబ సమేతంగా, బంధు మిత్రులతో తరలి రా వాలని జిల్లా ప్రజలకు కలెక్టర్, టూరిజం కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. కడప కలెక్టరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గండికోట ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని, ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని ఆహ్వానం పలికారు. కన్నుల పండుగ వాతావరణంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను అత్యంత ప్రాధాన్యతతో జనవరి 11, 12, 13వ తేదీల్లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పర్యాటకులు, సందర్శకులను విశేషంగా ఆకట్టుకునేలా కార్యక్రమాలను రూపొందించామని కలెక్టర్ వివరించారు. వివిధ పోటీలలో విజేతలుగా నిలిచినవారికి చివరిరోజు బహుమతులను ప్రదానం చేస్తామన్నారు.
నేటి నుంచి
నేటి నుంచి


