దివ్యాంగులకు ప్రభుత్వం చేయూత

- - Sakshi

రాయచోటి : దివ్యాంగులమని నిరుత్సాహపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేక సహకారాన్ని, గుర్తింపును, చేయూతను అందిస్తోందని జిల్లా కలెక్టర్‌ గిరీషా పీఎస్‌ తెలిపారు. సోమవారం రాయచోటిలోని కలెక్టరేట్‌ ఆవరణంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల స్కూటర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ గిరీషా పీఎస్‌, శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటిి అమరనాథ్‌రెడ్డి, జేసీ తమీమ్‌అన్సారియా, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్‌ చైర్మన్‌ ముంతాజ్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వినికిడి యంత్రాలు, ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు అందిస్తోందన్నారు. ఈసారి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి జిల్లాలో మొదటిసారిగా 57 మందికి రూ.68 లక్షల ఖర్చుతో మోటోరైజ్‌డ్‌ స్కూటర్లను అందించడం హర్షించదగ్గ అంశం అన్నారు. అనంతరం శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ కుల, మత, వర్గ రాజకీయ భేదాలు చూడకుండా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందించాలని ధ్యేయంగా సీఎం జగన్‌ పనిచేస్తున్నారన్నారు. జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల వారికి మేలు చేస్తున్నారని చెప్పారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ దయ, కరుణ, మానవత్వానికి ప్రతీకగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్పొరేషన్‌ చైర్మన్‌ ముంతాజ్‌ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో మొదటిసారిగా మోటార్‌ సైకిల్‌ వానాలు అందజేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా, వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్‌ఖాన్‌, వెలుగు సంస్థ వ్యవస్థాపకుడు ఉదయ్‌, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కిశోర్‌బాబు, విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు.

అర్జీలకు త్వరితగతిన పరిష్కారం

స్పందన ద్వారా అందిస్తున్న ప్రజల అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ గిరీషా పీఎస్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, డీఆర్‌ఓ సత్యనారాయణ, భూముల సర్వే విభాగం సహాయ సంచాలకుడు జయరాజ్‌ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు.

విజేతలకు కలెక్టర్‌ అభినందన

నేపాల్‌లోని ఖాట్మండులో జరిగిన సౌత్‌ ఏసియా చాంపియన్‌షిప్‌లో అన్నమయ్య జిల్లా విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో కలెక్టర్‌ గిరీషా పీఎస్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌క్యూఏవై మార్షల్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ అన్నమయ్య జిల్లా సెక్రటరీ షేక్‌ ఫాహీం, అండర్‌–18 బాలికల విభాగం విజేత పి.హిరణ్మయి, అండర్‌–14 విభాగం షేక్‌ రియాన్‌, ఎస్‌క్యూఏవై మార్షల్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ స్టేట్‌ చైర్మన్‌ ఇస్మాయిల్‌, జిల్లా ప్రెసిడెంట్‌ నరసింహులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వేగవంతంగా ఇళ్ల నిర్మాణంపై దృష్టి

ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి మండలానికి రెండు సెంట్రింగ్‌ యూనిట్లు రుణం మంజూరు చేయాలని బ్యాంకర్లను కలెక్టర్‌ గిరీషా పీఎస్‌ ఆదేశించారు. సోమవారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని మినీ వీడియో కాన్ఫరెన్సు హాల్‌లో సెంట్రింగ్‌ యూనిట్స్‌, రుణ మంజూరు, పంచాయతీలు, వార్డుల్లో చలివేంద్రాల ఏర్పాటు, స్పందన, గృహనిర్మాణ పురోగతి తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. జేసీ తమీమ్‌ అన్సారియా, డీఆర్‌ఓ సత్యనారాయణ, భూముల సర్వే విభాగం ఏడీ జయరాజ్‌, హౌసింగ్‌ పీడీ శివయ్య, డ్వామా పీడీ మద్దిలేటి పాల్గొన్నారు.

చలివేంద్రం ఏర్పాటు

రాయచోటి అర్బన్‌ : ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ గిరీషా పీఎస్‌ అన్నారు. కలెక్టరేట్‌ ఆవరణంలో ఆయన, జేసీ తమీమ్‌ అన్సారియాతో కలిసి చలివేంద్రం ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ సత్యనారాయణ, కలెక్టరేట్‌ ఏఓ బాలకృష్ణ, ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అందరికీ అందుబాటులో వైద్య సేవలు

– అత్యాధునిక 104 వాహనాలను ప్రారంభించిన కలెక్టర్‌, ఎమ్మెల్యే

రాయచోటిటౌన్‌ : నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ గిరీషా పీఎస్‌, శాసన సభ వ్యవహారాల సమన్వయకర్త, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. సోమవారం రెండు 104 వాహనాలను వీరు పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, రాయచోటి మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాషాలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 104 ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ పేదలకు వేగంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి అత్యాధునిక 108,104 అంబులెన్స్‌ వ్యవస్థ ప్రవేశ పెట్టారన్నారు. దీనికి ఆద్యుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొండయ్య, డీసీహెచ్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌, డీసీఎంఓ లోక వర్దన్‌,104 జిల్లా అధికారి ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

విభిన్న ప్రతిభావంతులకు

మూడు చక్రాల స్కూటర్ల పంపిణీ

జగనన్న వాహనమిత్ర పథకంలో

భాగంగా. రూ.68 లక్షల వ్యయంతో 57 మందికి స్కూటర్లు

జిల్లా కలెక్టర్‌ గిరీషా పీఎస్‌

Read latest Annamayya News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top