కేంద్రీయం.. విద్యా సుగంధం

- - Sakshi

రాజంపేట వద్ద ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయం

రాయచోటిలో కేంద్రీయ విద్యాలయానికి సేకరించిన స్థలం

సాక్షి రాయచోటి : అన్నమయ్య జిల్లా చదువుల కోవెలగా మారుతోంది. ఇప్పటికే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్న జిల్లాగా అన్నమయ్యకు ప్రత్యేక గుర్తింపు ఉంది. హార్సీలీహిల్స్‌ వద్ద రిషివ్యాలీతోపాటు మరికొన్ని పేరొందిన విద్యా సంస్థలు జిల్లాలో ఉన్నాయి. అంతేకాకుండా మరిన్ని విద్యా సంస్థలు కూడా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. రాజంపేటలో 2016లో కేంద్రీయ విద్యాలయాన్ని నెలకొల్పగా, తాజాగా మరో రెండు కేంద్రీయ విద్యాలయాలు జిల్లాకు మంజూరయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలతోపాటు మరికొంతమంది సాధారణ ప్రజలకు సంబంధించిన పిల్లలకు కూడా కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకునే అవకాశాలు లభించనున్నాయి. ఇటీవల రాష్ట్రంలో తొమ్మిది కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా, అందులో అన్నమయ్య జిల్లాకు రెండింటిని కేటాయించడంతో అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తమమతోంది.

విద్యకు పెద్దపీట

రాష్ట్ర ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్య పరంగా ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఒకవైపు పాఠశాలలను నాడు–నేడు కింద అద్భుతంగా తీర్చిదిద్దుతోంది. మరోవైపు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇంకోవైపు చదువును ప్రోత్సహిస్తూ విద్యార్థులకు అమ్మ ఒడి పథకం ద్వారా ప్రోత్సాహక నిధులను అందిస్తున్నారు. దీనికితోడు టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇలా చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాలతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థుల గుండెల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.

కేంద్రీయ విద్యాలయాలకు స్థలాల గుర్తింపు

అన్నమయ్య జిల్లాకు ప్రస్తుతం మంజూరైన రెండు ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయాలకు స్థల సేకరణ కూడా పూర్తయింది. జిల్లా కేంద్రమైన రాయచోటిలో కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి దిగువ అబ్బవరం ప్రాంతంలో ఐదు ఎకరాలను అధికారులు ఎంపిక చేశారు. అలాగే మదనపల్లె ప్రాంతం వలసపల్లె సమీపంలోని నవోదయ వద్ద ఐదు ఎకరాలను గుర్తించారు. ఈ ఎంపిక చేసిన స్థలాల్లోనే కేంద్రీయ విద్యాలయాల నిర్మాణాలకు సంబంధించి నివేదికలను పంపారు. ఈ ఏడాది విద్యా సంవత్సరంలోనే మదనపల్లెలోని గిరిజన బాలుర హాస్టల్‌లో తరగతులు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలో రెండు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుపై విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు.

అన్నమయ్య జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలతో పాటు సాధారణ ప్రజలకు సంబంధించిన పిల్లలకు

ఉత్తమ విద్య అందించే దిశగా అడుగులు పడుతున్నాయి. రాయచోటి, మదనపల్లెకు కేంద్రీయ విద్యాలయాలు

మంజూరు కావడంపై ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్య అందుతుందనే ఆశాభావం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది.

000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

అన్నమయ్య జిల్లాకు

కేంద్రీయ విద్యాలయాలు మంజూరు

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో

విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన

ఇప్పటికే రాజంపేటలో

ఒక కేంద్రీయ విద్యాలయం

తాజాగా రాయచోటి, మదనపల్లెలకు మంజూరు

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న

తల్లిదండ్రులు, విద్యావేత్తలు

కేంద్రీయ విద్యాలయాల ద్వారా నాణ్యమైన విద్య

అన్నమయ్య జిల్లాకు సంబంధించి గతంలో ఒక కేంద్రీయ విద్యాలయం ఉండగా, ప్రస్తుతం రెండు మంజూరయ్యాయి. అందులో జిల్లా కేంద్రమైన రాయచోటితోపాటు మదనపల్లెలో ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన స్థలాల ఎంపిక కూడా పూర్తయింది. ఒక్కో విద్యాలయానికి ఐదు ఎకరాలు చొప్పున స్థలాన్ని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాము. ఈ ఏడాది మదనపల్లెలో అడ్మిషన్లు ప్రారంభించనున్నాం. కేంద్రీయ విద్యాలయాల ద్వారా నాణ్యమైన విద్య అందించడంతోపాటు ఆహ్లాదకర వాతావరణంలో చదువు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నాం.

– గిరీషా పీఎస్‌, కలెక్టర్‌, అన్నమయ్య జిల్లా

Read latest Annamayya News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top