దక్షిణాదిలో పార్లమెంట్‌ సమావేశాలు.. ప్రధానికి ఎంపీ గురుమూర్తి లేఖ | YSRCP MP Gurumurthy Wrote Letter To PM Modi Over Parliament Sessions | Sakshi
Sakshi News home page

దక్షిణాదిలో పార్లమెంట్‌ సమావేశాలు.. ప్రధానికి ఎంపీ గురుమూర్తి లేఖ

Dec 1 2024 6:22 PM | Updated on Dec 1 2024 6:22 PM

YSRCP MP Gurumurthy Wrote Letter To PM Modi Over Parliament Sessions

సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ఈ క్రమంలో దక్షిణ భారత్‌లో పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించాలని లేఖలో డిమాండ్‌ చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ  ఈ డిమాండ్‌కు అందరూ సహకరించాలి ఆయన కోరారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ లేఖలో గురుమూర్తి..‘దక్షిణ భారత్‌లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఏడాదికి కనీసం రెండు పార్లమెంట్ సెషన్స్ దక్షిణ భారత రాష్ట్రాల్లో నిర్వహించాలి కోరారు. జాతీయ సమగ్రత దృష్ట్యా దక్షిణ భారత రాష్ట్రాల్లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించడం మంచిదన్నారు.

ఇదే సమయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ సైతం ఈ అంశాలను భాషా పాలిత రాష్ట్రాలు అనే పుస్తకంలో ప్రస్తావించారని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే అంశంపై విశాల దృక్పథంతో ఉండాలని నాటి ప్రధాని వాజ్‌పేయ్‌ కూడా చెప్పినట్టు తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ డిమాండ్‌కు అందరూ సహకరించాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement