
సాక్షి, గుంటూరు: ‘ముద్రగడని చంద్రబాబు చిత్రహింసలకు గురిచేసినప్పుడు.. చిరంజీవి సింహంలా గర్జించాడు! తమ్ముడు తటపటాయించాడు. కాపులను శాసించే స్థాయికి ఎలా తీసుకెళ్తారు సార్’’ అంటూ ట్విట్టర్ వేదికగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘అన్నయ్య వస్తాడని ఎదురుచూసి మోసపోకుమా.. తమ్ముళ్ల తో సర్దుకుని సాగిపో సుమా’’ అని ఎద్దేవా చేశారు. చదవండి: విజయనగరం జిల్లాలో టీడీపీకి షాక్..
శుక్రవారం చేసిన ట్వీట్‌లో ‘‘ఎస్‌ఈసీ వ్యవహార శైలి చూస్తే.. తక్షణమే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా తొలగించి.. ఆ స్థానంలో చంద్రబాబుని నియమించవలసిందిగా నిమ్మగడ్డ గవర్నర్‌కి లెటర్ రాసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పిచ్చి ముదిరింది’’ అని ఎమ్మెల్యే అంబటి చురకలు అంటించారు. చదవండి: చిరంజీవి రాకపై ఇప్పుడే చెప్పలేను: పవన్‌కల్యాణ్