జగన్‌ను కలిసిన రైతులే వారి టార్గెట్‌: వైఎస్సార్‌సీపీ నేతలు | YSRCP Leaders Serious Comments On TDP Attacks In Guntur | Sakshi
Sakshi News home page

జగన్‌ను కలిసిన రైతులే వారి టార్గెట్‌: వైఎస్సార్‌సీపీ నేతలు

Jun 27 2026 1:21 PM | Updated on Jun 27 2026 1:59 PM

YSRCP Leaders Serious Comments On TDP Attacks In Guntur

సాక్షి, తాడేపల్లి:  అమరావతిలో భారీగా అవినీతి జరుగుతోందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా రైతుల  నుంచి భూములు లాక్కుంటోంది. మూడు పంటలు పండే భూములను అన్యాయంగా తవ్వేశారు. ఉండవల్లిలో దాడులు చేసిన వారు ఎవరో స్పష్టంగా తెలుస్తోందని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌కు కలిసిన రైతుల ధైర్యాన్ని చంపాలన్నదే వారి కుట్ర అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉండవల్లిలో రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై టీడీపీ గూండాల దాడిని వైఎస్సార్‌సీపీ నేతలు ఖండించారు. ఈ సందర్బంగా తాడేపల్లిలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..‘వైఎస్‌ జగన్‌ను కలిసి అమరావతి రైతులు తమ బాధలు చెప్పుకున్నారు. అవసరం లేకపోయినా ప్రభుత్వం భూములు సేకరిస్తోంది. ఇది అన్యాయమని అమరావతి రైతులు జగన్‌కు చెప్పుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా భూములు లాక్కుంటోంది. రైతుల భూముల్లో మట్టి తవ్వుకుని అమ్ముకుంటున్నారని తెలిపారు.

రైతుల ఆహ్వానం మేరకే పరిరక్షణ కమిటీ ఈరోజు అమరావతికి వెళ్లింది. అమరావతి అక్రమాలు బయటకు రావొద్దని బాటు, లోకేష్‌ కుట్రలు చేశారు. అమరావతి అప్పులు, దోపిడీ, అవినీతి బయటకు రాకుండా కుట్రలు చేస్తున్నారు. మూడు పంటలు పండే భూములను అన్యాయంగా తవ్వేశారు. అమరావతి పేరుతో అప్పులు చేస్తున్నారు. దాడులు చేసిన వారు ఎవరో స్పష్టంగా తెలుస్తోంది. గూండాలు, రౌడీలను కావాలనే దాడికి తీసుకువచ్చారు. దాడి చేసిన వారు ఏ స్థితిలో ఉన్నారో అందరికీ తెలుసు. జగన్‌కు కలిసిన రైతుల ధైర్యాన్ని చంపాలన్నదే వారి కుట్ర. జగన్‌ను కలిసి అమరావతి రైతులు తమ బాధలు చెప్పుకున్నారు. అమరావతిలో భారీగా అవినీతి జరుగుతోంది. మేము వెళ్తే అక్కడ జరిగే దోపిడీ, రైతుల సమస్యలు ప్రపంచానికి తెలుస్తాయని భయపడ్డారు. కుట్ర పన్ని ఉండవల్లి సెంటర్‌లో అడ్డుకుని దాడి చేశారు. మమ్మల్ని అడ్డుకున్న వారు రాజధానికి భూములు ఇవ్వలేదు. పాలకొల్లు సత్యం అనే వ్యక్తి గూండాలను తెచ్చారు. క్వారీల్లో పనిచేసే వారిని తెచ్చి మద్యం తాగించి దాడి చేశారు. తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు మరి పూలింగులో భూమి ఎందుకు ఇవ్వలేదు?. కానీ రౌడీ మూకలను మాపైకి పంపాడు. డీఎస్పీ వచ్చి మరింత రెచ్చగొట్టి దాడి చేయించాడు. మాపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలి’ అని డిమాండ్‌ చేశారు. 

పోలీసులు న్యాయం పక్షాన ఉన్నారా?..
మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. మమ్మల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది?. కానిస్టేబుల్‌పై రాయి వేసిందెవరో అందరికీ తెలుసు?. రైతుల విజ్ఞప్తితోనే వైఎస్‌ జగన్‌ పరిరక్షణ కమిటీ వేశారు. క్షేత్ర స్థాయితో పరిశీలించమని రైతులు కోరారు. రైతుల సమస్యలపై మేము పెనుమాక వెళ్తుంటే అడ్డుకున్నారు. మాది గొడ్డలి పార్టీ అయితే.. మేం తన్నులు తింటామా?. గొడ్డలి పార్టీ ఎవరిదో చంద్రబాబు చెప్పాలి. పోలీసులు న్యాయం పక్షాన ఉన్నారా?.. గుండాల పక్షాన ఉన్నారా?. రాష్ట్రంలో కూటమి పాలన దుర్మార్గంగా ఉంది. మేము ప్రజాస్వామ్యయుతంగా వెళ్తే బండరాళ్లతో దాడి చేశారు.

మాపైనే దాడి చేసి.. మళ్లీ మామీదే కేసులు పెడుతున్నారు. పోలీసుల సమక్షంలోనే మాపై దాడి చేశారు. మాపై దాడి చేసిన విజువల్స్‌ ఉన్నాయి. పోలీసులు చర్యలు తీసుకుంటారా? లేదా.? మమ్మల్ని అడ్డుకుంది రైతులు కాదు.. టీడీపీ గూండాలే. నారా లోకేష్‌ ప్రోద్బలంతోనే దాడులు జరిగాయి. రైతుల ముసుగులో టీడీపీ గూండాలు మమ్మల్ని అడ్డుకున్నారు. టీడీపీ గూండాల దాడులను మేము లెక్కచేయం. దాడులను ప్రజాస్వామ్యంగా ఎదుర్కొంటాం. చంద్రబాబు గొడ్డలిని లోకేష్‌ చేతిలో పెట్టారు. లోకేష్‌ చేతిలో గొడ్డలి పెట్టి చంద్రబాబు నాటకాలు చేస్తున్నారు. ఎవరెంత అడ్డుకున్నా రైతుల పక్షాన పోరాడుతాం. 

ప్రజా రాజధాని ఎలా అవుతుంది..
మంగళగిరి ఇంచార్జ్‌ దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ..‘రాజధానిలోకి మేము వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?. అక్కడ జరిగేది అంతా అక్రమాలు, అవినీతే. రైతులకు అండగా వెళ్తే దాడులు చేస్తారా?. మంగళగిరి నియోజకవర్గంలో ఏనాడూ ఇలాంటి దుర్మార్గం జరగలేదు. పోలీసుల సాక్షిగా కార్లు ధ్వంసం చేశారు. మాపై రాళ్లదాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ప్రజాస్వామ్య విధానాలు రాష్ట్రంలో లేవనటానికి ఈ సంఘటనే నిదర్శనం. టెర్రర్‌ సృష్టించే అమరావతి.. ప్రజా రాజధాని ఎలా అవుతుంది’ అని మండిపడ్డారు. టీడీపీ గూండాల ఉడుత ఊపులకు భయపడే ప్రసక్తే లేదు. అమరావతిని బాబు తన బినామీలకు అప్పజెప్పాడు. ఈరోజు జరిగిన దాడిలో టీడీపీ మాఫియాదే కీలకపాత్ర. రైతు పరిరక్షణ కమిటీ అంటే ఎందుకంత భయపడుతున్నారు? అమరావతికి ఫౌండేషన్‌ పడినప్పటి నుంచి అన్నీ దుర్మార్గాలే’ అని మండిపడ్డారు. 

విధ్వంసాలకు మేము భయపడం..
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ..‘ఏపీలో జరుగుతున్న దారుణాలు చూసి దేశం ఛీ కొడుతోంది. నిత్యం అరాచకాలు, లాకప్ డెత్‌లు జరుగుతున్నాయి. ఇవ్వాళ్టి ఘటనపై మేధావులు ఆలోచించాలి. ఎక్కడో మారుమూలన కాదు, రాష్ట్ర నడిబొడ్డున మాపై దాడి చేశారు. మేము వస్తే చంద్రబాబు, లోకేష్ ఎందుకు భయపడుతున్నారు?. దాడులు, విధ్వంసాలకు మేము భయపడం. మా పార్టీ పేరులోనే రైతులు ఉన్నారు. చంద్రబాబుకు జ్ఞానం, బుద్ది కలగాలంటూ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు ఇంటికి దగ్గరే మాపై దాడి జరిగింది. మా నేతలు, లీగల్ సభ్యులపై దాడి చేశారు. ఇదేనా చంద్రబాబూ.. నీ పాలన? అని ప్రశ్నించారు.

దేవినేని అవినాష్ మాట్లాడుతూ..‘టీడీపీ గూండాలు చిల్లర వ్యక్తులను పోగేసి దాడులు చేశారు. ఇలాంటి నీచ రాజకీయాలు, దాడులకు మేము భయపడం. రైతులు భయపడాల్సిన పనిలేదు, వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement