ఎన్నికల కమిషనర్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతల బృందం | YSRCP Leaders Meet Election Commissioner Neelam Sahni Over AP Local Body Elections, More Details Inside | Sakshi
Sakshi News home page

ఎన్నికల కమిషనర్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతల బృందం

Jul 31 2025 4:39 PM | Updated on Jul 31 2025 5:06 PM

YSRCP Leaders Meet Election Commissioner Neelam Sahni

విజయవాడ:  ఆగస్టు 10వ జరగబోయే  స్థానిక సంస్థల ఉప ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ నేతల బృందం.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నిని కలిసింది.  రాష్ట్ర ఈసీని కలిసిన వైఎస్సార్‌సీపీ నేతల్లో  గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్‌, ఎమ్మెల్సీ  మొండితోక అరుణ్ కుమార్‌లు ఉన్నారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించాలని ఈసీకి వినతిపత్రం సమర్పించారు. 

ఈసీని కిలిసిన అనంతరం గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష నేతల పర్యటనలను అడ్డుకుంటున్నారు. ముళ్ల కంచెలు, బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారు. 

తిరుపతి,తిరువూరు,కుప్పం వంటి మున్సిపల్ బై ఎలక్షన్స్ లో దుర్మార్గంగా వ్యవహరించారు. ఆగస్ట్ 10న జరగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించాలి. ఎన్నికలకు పటిష్టమైన భద్రత కల్పించాలి. సిసి కెమెరాల నిఘా మధ్య ఎన్నికలు జరిపించాలి.  నామినేషన్లు వేయకుండా టిడిపి నేతలు బెదిరిస్తున్నారు. ఆన్ లైన్ నామినేషన్లకు అనుమతించాలని కోరాం’ అని ఆయన స్పష్టం చేశారు. 

10, 12 తేదీల్లో ‘స్థానిక’ ఉప ఎన్నికలు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement