మీ దీవెనలే ప్రభుత్వానికి బలం | YSRCP Leaders In Gadapa Gadapaki Mana Prabhutvam | Sakshi
Sakshi News home page

మీ దీవెనలే ప్రభుత్వానికి బలం

Oct 2 2022 5:14 AM | Updated on Oct 2 2022 5:14 AM

YSRCP Leaders In Gadapa Gadapaki Mana Prabhutvam - Sakshi

నెల్లూరు జిల్లా గుమ్మళ్లదిబ్బ ప్రాంతంలో జోరువానలో పర్యటిస్తూ సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే నల్లపురెడ్డి

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద అపూర్వ ఆప్యాయత దక్కుతోంది. అన్ని జిల్లాల్లో శనివారం ఈ కార్యక్రమం ఉల్లాసంగా..ఉత్సాహంగా సాగింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.

మా సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌కి, మీకు మా ఆశీస్సులు ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు దీవించారు. మీ చల్లని దీవెనలే మన ప్రభుత్వానికి బలమని, మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ఈ సందర్భంగా వారు ప్రజలకు చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement