
అనారోగ్యంతో అస్వస్థతకు గురైన మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభాన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు. సోమవారం అంబులెన్స్‌లోనే రోడ్డు మార్గం గుండా ఆయనను కుటుంబ సభ్యులు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభంను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించనున్నారు. సోమవారం రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్ తీసుకురానున్నారు. అనారోగ్యంతో అస్వస్థతకు గురైన పద్మనాభంకు రెండు రోజులుగా కాకినాడ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
అయితే.. ఈ ఉదయం ముద్రగడ కోరిక మేరకు తొలుత కిర్లంపూడికి ఆంబులెన్స్‌లో కుటుంబ సభ్యులు తరలించారు. ముద్రగడ వెంట పిఠాపురం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి వంగా గీత ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ని ఇవాళే హైదరాబాద్‌కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే..
జగన్‌కు కృతజ్ఞతలు: ముద్రగడ తనయులు
తమ తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ముద్రగడ కుమారులు బాలు, గిరిబాబులు కృతజ్ఞతలు తెలియజేశారు. ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని, తరలింపు నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందవద్దని వారు కోరుతున్నారు. జగన్ సూచన మేరకు ఇవాళే హైదరాబాద్‌కు తమ తండ్రిని తరలిస్తామని ప్రకటించారు.
ముద్రగడ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకుని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ముద్రగడ తనయుడు, పార్టీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ గిరిబాబును ఫోన్‌లో పలకరించారు. పద్మనాభం ఆరోగ్య పరిస్థితి, కాకినాడ ఆస్పత్రిలో అందుతున్న వైద్యం గురించి వివరాలు అడిగి తెలుకున్నారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాటు చేస్తామని, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

ఈ క్రమంలో కాకినాడ వైద్యులూ హైదరాబాద్ తీసుకువెళ్లడం మంచిదని, అయితే రోడ్డుమార్గం అంత శ్రేయస్కరం కాదని చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జగన్‌మోహన్‌రెడ్డి సాధ్యమైనంత త్వరగా ముద్రగడను ఎయిర్ అంబులెన్స్‌లో తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని పార్టీనేతలకు సూచించారు. అదివారం రాత్రి తరలించేందుకు సాంకేతికంగా ఇబ్బంది ఉండటంతో ఇవాళ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.