పండుగలా వైఎస్సార్‌సీపీ జిల్లా ప్లీనరీలు | Sakshi
Sakshi News home page

పండుగలా వైఎస్సార్‌సీపీ జిల్లా ప్లీనరీలు

Published Thu, Jun 30 2022 5:27 AM

YSRCP district plenaries success anakapalle prakasam annamayya - Sakshi

సాక్షి, అనకాపల్లి/సాక్షి ప్రతినిధి ఒంగోలు/సాక్షి రాయచోటి: వైఎస్సార్‌సీపీ జిల్లా స్థాయి ప్లీనరీలు బుధవారం అనకాపల్లి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తల ఉత్సాహం నడుమ పండుగ వాతావరణంలో ప్లీనరీలు జరిగాయి.

వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో పెందుర్తిలో నిర్వహించిన ప్లీనరీలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి విశాఖ జిల్లా రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, పెట్ల ఉమాశంకర్‌ గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, ప్లీనరీ పరిశీలకుడు చొక్కాకుల వెంకట్రావ్, పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలు పేర్నమిట్టలో నిర్వహించిన ప్లీనరీకి టీటీడీ బోర్డు సభ్యుడు, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ అధ్యక్షత వహించగా.. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మునిసిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత, ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ ప్లీనరీ పరిశీలకుడు తూమాటి మాధవరావు, ఎమ్మెల్యేలు కేపీ నాగార్జునరెడ్డి, అన్నా వెంకటరాంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్, టీజేఆర్‌ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్‌ల చైర్మన్‌లు పాల్గొన్నారు.

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో నిర్వహించిన ప్లీనరీలో విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  ఎంపీ మిథున్‌రెడ్డి, పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నవాజ్‌బాషా, ప్లీనరీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ జకియాఖానమ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement