డీఎస్సీ అక్రమాలపై పోరాటం కొనసాగింపు | YSRCP Continues Protest Over Alleged DSC Irregularities in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలపై పోరాటం కొనసాగింపు

Aug 7 2026 5:20 AM | Updated on Aug 7 2026 5:20 AM

YSRCP Continues Protest Over Alleged DSC Irregularities in Andhra Pradesh

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన

సాక్షి,అమరావతి: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, వాటికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.

 దీనిలో భాగంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ శుక్ర, శనివారాల్లో (7, 8 తేదీల్లో) అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలను కొనసాగించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులకు కేంద్ర కార్యాలయం పిలుపునిచి్చంది. అలాగే ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. 

పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతతో పాటు ప్రజలు ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరింది. ఈ నెల 10న నిర్వహించే ర్యాలీలు ముగిసిన అనంతరం ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెంచేలా మలిదశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్లు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement