వైఎస్సార్‌సీపీ బీసీ నేతల సమావేశం ప్రారంభం | YSRCP BC Leaders Meeting At Tadepalli Updates | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ బీసీ నేతల సమావేశం ప్రారంభం

Aug 24 2026 11:22 AM | Updated on Aug 24 2026 2:28 PM

YSRCP BC Leaders Meeting At Tadepalli Updates

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ బీసీ నేతల సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలోని బీసీ నేతలు ఈ భేటీకి హాజరై పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులు, బీసీలకు ఎదురవుతున్న సమస్యలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం.

అలాగే రానున్న రోజుల్లో బీసీల కోసం పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన కార్యాచరణపై నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీసీల హక్కులు, రక్షణ, సంక్షేమం వంటి అంశాలపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా బీసీలపై జరుగుతున్న దాడులపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు, ఆయా ఘటనలపై పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపైనా నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం బీసీల సమస్యలపై పార్టీ భవిష్యత్ కార్యాచరణను నేతలు వెల్లడించే అవకాశం ఉంది.

బీసీ రాష్ట్ర గర్జనకు రూట్ మ్యాప్ .. తాడేపల్లిలో YSRCP బీసీ నేతల కీలక భేటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement