
సాక్షి,తాడేపల్లి: సర్ ఆర్థర్ కాటన్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈమేరకు గురువారం (జులై24) వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
‘సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి, ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి, గోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన దార్శనికుడు సర్ ఆర్థర్ కాటన్ గారు. కరువు కోరల్లో ఉన్న ప్రాంతాలను పచ్చటి తివాచీలుగా మార్చిన ఆ మహానీయుడి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నా’ అని పేర్కొన్నారు.

సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి, ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి, గోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన దార్శనికుడు సర్ ఆర్థర్ కాటన్ గారు. కరువు కోరల్లో ఉన్న ప్రాంతాలను పచ్చటి తివాచీలుగా మార్చిన ఆ మహానీయుడి వర్ధంతి సందర్భంగా మన… pic.twitter.com/WmLUpW9hvT
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2025