సాక్షి,తాడేపల్లి: ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని గంగపుత్రులకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాంకాక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌లో ‘సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని, ఎగసిపడుతున్న కెరటాలతో నిత్యం పోరాటం చేస్తూ జీవనం సాగిస్తున్న నా గంగ పుత్రులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. మన ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టాం. వివిధ పథకాల ద్వారా మత్స్యకారులకు రూ.4,913 కోట్లు లబ్ధి చేకూర్చాం. గతంలోనే కాదు ఇప్పుడు, ఎప్పుడూ మత్స్యకారులందరికీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని మాట ఇస్తున్నా’అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని, ఎగసిపడుతున్న కెరటాలతో నిత్యం పోరాటం చేస్తూ జీవనం సాగిస్తున్న నా గంగ పుత్రులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. మన ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల…
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 21, 2025



