రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన | YS Jagan Two Days Tour Of Pulivendula Constituency | Sakshi
Sakshi News home page

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

Jul 6 2026 12:47 PM | Updated on Jul 6 2026 3:23 PM

YS Jagan Two Days Tour Of Pulivendula Constituency

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పులివెందుల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు, ఎల్లుండి(మంగళ,బుధ) పర్యటించనున్నారు. ఆయన రేపు(మంగళవారం) ఉదయం 11.30 గంటలకు పులివెందుల చేరుకుంటారు. అనంతరం భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్భార్‌ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.

బుధవారం ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నిర్వహించనున్న ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు. కార్యక్రమం అనంతరం వైఎస్‌ జగన్‌ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.

పులివెందులకు వైఎస్‌ జగన్‌ పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement