‘బాబూ.. జాబులేవి?’ అని అడగడమే నేరమా? | YS Jagan Serious On Chandrababu Over Cases Filed On Kakinada Unemployed | Sakshi
Sakshi News home page

‘బాబూ.. జాబులేవి?’ అని అడగడమే నేరమా?

Sep 9 2026 5:20 AM | Updated on Sep 9 2026 5:21 AM

YS Jagan Serious On Chandrababu Over Cases Filed On Kakinada Unemployed

ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తే కేసులా? : మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 

నిరసన తెలిపిన నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపుతారా? 

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వాలని అడగడం కూడా తప్పా? 

ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరంగా మారిందా? 

జాబ్‌ క్యాలెండర్, 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఎక్కడ?

అవి అడిగిన వారిపై కేసులు పెట్టడం అప్రజాస్వామికం 

నిరుద్యోగులపై పెట్టిన కేసులన్నీ తక్షణమే ఉపసంహరించాలి 

మెగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలి

సాక్షి, అమరావతి: ఇచ్చిన హామీలను నెరవేర్చా లని కాకినాడలో శాంతియుతంగా ర్యాలీ చేసిన నిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా కేసులు పెట్టడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను నెరవేర్చాలని నిరసన తెలి­పిన నిరుద్యోగులపై కేసులు పెడతారా? అంటూ నిలదీశారు. ఇది కూటమి ప్రభుత్వం నిరంకుశ విధానానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కూటమి ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. ఆయన ట్వీట్‌లో ఇంకా ఏమన్నారంటే...   

నిరుద్యోగ యువతపై కేసులా? 
మెగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలంటూ కాకినాడలో శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగ యువతపై చంద్రబాబు నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పోలీసు కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. శ్యామ్, టి.రాజా, ఎం. గంగ సూరిబాబు, రాజేష్‌తో పాటు 20 మంది పోలీసు నిరుద్యోగులు చేసిన నేరమేమిటి? ‘బాబూ.. జాబులేవి?’ అని ప్రశ్నించడమేనా నేరం? ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వాలని అడగడం కూడా తప్పా? ప్రజలు తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని శాంతియుతంగా ప్రశ్నించడం కూడా ఆంధ్రప్రదేశ్‌లో నేరంగా మారిందా?. 

అప్రజాస్వామిక వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది చంద్రబాబూ?
ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది నిరుద్యోగులకు ఈ లెక్కన ఏడాదికి రూ.7,200 కోట్లు, మూడేళ్లకు రూ.21,600 కోట్లు చెల్లించాలి. కానీ ఇటు ఉద్యోగాలు ఇవ్వకుండా, అటు నిరుద్యోగ భృతి చెల్లించకుండా యువతను మోసం చేసిన ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు తమ హక్కుల కోసం ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతోంది.

మెగా డీఎస్సీలో రోజుకొక మోసం బయటపడుతుంటే సమాధానం చెప్పలేక చంద్రబాబు, నారా లోకేశ్‌ ఇద్దరూ అణచివేత, నిర్బంధం, బెదిరింపులకు దిగుతున్నారు. అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందిన వారిని కాపాడుతూ.. పారదర్శకంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతున్న అర్హులైన నిరుద్యోగులను నేరస్తులుగా చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం యువత పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానానికి, అప్రజాస్వామిక వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?.  

యువత ఆశలు, ఆకాంక్షలను ఏనాడూ చంద్రబాబు గౌరవించలేదు 
వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతి­సారీ నియామకాల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిబంధనలకు విరుద్ధమైన నియామకాలు పరిపాటిగా మారాయి. అవినీతి, రాజకీయ పైరవీలతో ఉద్యోగాలను పంచుకోవడంపైనే వెన్నుపోటు పార్టీ దృష్టి తప్ప.. రాష్ట్ర యువత ఆశలు, ఆకాంక్షలను ఏనాడూ గౌరవించలేదు. ప్రతిభకు పట్టం కట్టి, అర్హులకు నిష్పక్షపాతంగా ఉద్యోగాలు కల్పిం చాలన్న చిత్తశుద్ధి ఈ వెన్ను­పోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి లేదు. నిరుద్యోగ యువతపై నమోదు చేసిన కేసులన్నింటినీ తక్షణమే, బేషరతుగా ఉపసంహరించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలి. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుంది. వారికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుంది’ అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement