విజయ్ దివస్.. సాయుధ బలగాలకు సెల్యూట్‌: వైఎస్‌ జగన్‌ | YS Jagan Praised Indian Army On Occasion Of Vijay Diwas | Sakshi
Sakshi News home page

విజయ్ దివస్.. సాయుధ బలగాలకు సెల్యూట్‌: వైఎస్‌ జగన్‌

Dec 16 2024 12:27 PM | Updated on Dec 16 2024 3:47 PM

YS Jagan Praised Indian Army On Occasion Of Vijay Diwas

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, తాడేపల్లి: నేడు విజయ్‌ దివస్‌. ఈ సందర్బంగా భారత సాయుధ బలగాల పరాక్రమంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం సైనికులు చేసిన ధైర్య సాహసాలను అందరూ స్మరించుకోవాలన్నారు.

విజయ్‌ దివస్‌ సందర్భంగా వైఎస్‌ జగన్‌ స్పందించారు. వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘విజయ్ దివస్ సందర్భంగా మన సాయుధ బలగాల ధైర్యసాహసాలు, త్యాగాలను స్మరించుకుని, సెల్యూట్ చేద్దాం. 1971లో జరిగిన ఈ చారిత్రక విజయంలో మన సైనికులు చూపిన పరాక్రమం, సంకల్పం ఎనలేనిది. దేశం కోసం సైనికులు చేసిన ధైర్య సాహసాలు చరిత్రలో నిలిచిపోయేలా చేశాయి’ అని కామెంట్స్‌ చేశారు. 

విజయ్ దివస్ సందర్భంగా YS జగన్ ట్వీట్

Advertisement
 
Advertisement
Advertisement