
విశాఖపట్నం జిల్లా ముఖ్యమంత్రిగా మనవడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలు ఆ అవ్వ మరచిపోలేదు. జగన్ ఫొటో చూడగానే.. గడప దాటకుండా ఇంటికే అందించిన పింఛన్లు, రేషన్ సరకులు, సంక్షేమ పథకాలు ఆమెకు గుర్తొకొచ్చాయి. గుండెల్లో ప్రేమ తన్నుకొచ్చింది. రెండు చేతులు జోడించి అభివాదం చేసింది.
జగన్ చిత్ర పటానికి ముద్దులెట్టి మనసులోతుల్లోని అభిమానాన్ని చాటుకుంది.. అవ్వ తాంగుల బుడ్డి. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టులో ఈ దృశ్యం చోటుచేసుకుంది. ‘మాకు అన్ని విధాలుగా మేలు చేశాడు.. నా మనవడు’ అంటూ ఆమె పలికిన మాటలు... పేద జనం గుండెల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన వేసిన ముద్రకు తార్కాణాలు.