సాక్షి, తాడేపల్లి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని తన దూరదృష్టి, సంస్కరణలతో అభివృద్ధి పథంలో నడిపించి, భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మేధావి పీవీ నరసింహారావు. భారత ప్రధానిగా దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. నేడు పీవీ గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని తన దూరదృష్టి, సంస్కరణలతో అభివృద్ధి పథంలో నడిపించి, భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మేధావి పీవీ నరసింహారావు గారు. భారత ప్రధానిగా దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. నేడు పీవీ గారి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/60LJh7XOLM
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 28, 2026


