సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ కీలక నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ (Shailajanath) ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సాకె గంగమ్మ ఈ ఉదయం(శుక్రవారం) కన్నుమూశారు. దీంతో పలువురు రాజకీయ నేతలు ఆయనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు.
గంగమ్మ మరణం పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. శైలజానాథ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు.. గంగమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేసిన సాకే శైలజానాథ్.. ప్రస్తుతం శింగనమల వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు.


