రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ భేటీ | YS Jagan Key Meeting With YSRCP Local Body Representatives | Sakshi
Sakshi News home page

రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ భేటీ

May 27 2025 6:09 PM | Updated on May 27 2025 7:24 PM

YS Jagan Key Meeting With YSRCP Local Body Representatives

సాక్షి,తాడేపల్లి : రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మండపేట, మదనపల్లె మున్సిపాలిటీలతో పాటు గొల్లప్రోలు నగర పంచాయతీ,  పెనుకొండ మండల నేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ కానున్నారు.  

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌లు, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లను ఆహ్వానించారు. వారితోపాటు ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరుకానున్నారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement