వావిలాల లీలా మహేశ్వరి మరణం బాధాకరం: వైఎస్‌ జగన్‌ | ys Jagan Expresses Shock Over the Demise of Kumari Vavilala Leela Maheshwari | Sakshi
Sakshi News home page

వావిలాల లీలా మహేశ్వరి మరణం బాధాకరం: వైఎస్‌ జగన్‌

May 24 2026 4:40 PM | Updated on May 24 2026 5:08 PM

ys Jagan Expresses Shock Over the Demise of Kumari Vavilala Leela Maheshwari

సాక్షి,గుంటూరు: కుమారి వావిలాల లీలా మహేశ్వరి మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.  

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కీర్తిశేషులు వావిలాల గోపాలకృష్ణయ్య గారి కుటుంబానికి చెందిన లీలా మహేశ్వరి జీవితాంతం సేవా భావంతో జీవించారు. వావిలాల గోపాలకృష్ణయ్య  చివరి దశలో ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. వావిలాల సంస్థకు విశిష్ట సేవలు అందించారు. ఉపాధ్యాయునిగా ఎన్నో సంవత్సరాలు అంకితభావంతో పనిచేశారు.

విద్యార్థుల్లో విలువలు, క్రమశిక్షణ, సామాజిక చైతన్యం పెంపొందించేందుకు ఆమె చేసిన కృషి సమాజానికి ఆదర్శనీయం. కుమారి వావిలాల లీలా మహేశ్వరి గారి మరణం సమాజానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’అని పేర్కొన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement