తాడేపల్లి: ఆర్మీ జవాన్ కిషన్ మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ‍్రాంతి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన హవల్దార్ కువ్వరపు కిషన్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తూ ఆయన ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమంటూ ట్వీట్ చేశారు.
‘‘దేశం కోసం ఆయన చేసిన సేవలకు సెల్యూట్ చేస్తున్నాను. హవల్దార్ కిషన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ తీవ్ర దుఃఖ సమయంలో ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ అన్నారు.
ఇదీ సంగతి: ఇండి కూటమి భేటీలో దేశ వ్యాప్తంగా నిరసనలకు నిర్ణయం
Deeply saddened by the loss of Havildar Kuvvarapu Kishan of Prakasam district, who died while performing operational duties along the India-China border. I salute his service to the nation. My heartfelt condolences to his family. May they find strength in this hour of grief. https://t.co/sYGDWSlnmx
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 30, 2026


