ఎన్డీటీవీ కొత్త లోగో.. వైఎస్‌ జగన్‌ అభినందనలు | YS Jagan Congratulates NDTV on New Logo | Sakshi
Sakshi News home page

ఎన్డీటీవీ కొత్త లోగో.. వైఎస్‌ జగన్‌ అభినందనలు

Aug 18 2026 12:45 PM | Updated on Aug 18 2026 12:49 PM

YS Jagan Congratulates NDTV on New Logo

సాక్షి, తాడేపల్లి: ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ కొత్త లోగోను ఆవిష్కరించుకున్న సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. విలువలు, విశ్వసనీయతతో బలమైన మీడియా సంస్థగా ఆ సంస్థ ఎదిగిందని కొనియాడారు. ధైర్యం, బాధ్యతతో వ్యవహరిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జర్నలిజం మౌలిక సూత్రాలను కొనసాగిస్తూ వచ్చిందని పేర్కొన్నారు.

అత్యంత కీలకమైన సమయాల్లో ప్రజలకు నమ్మకమైన గొంతుకగా ఎన్డీటీవీ నిలవాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. భవిష్యత్‌లో సంస్థ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కొత్త లోగో ఆవిష్కరణ సందర్భంగా సంస్థకు, అందులో పనిచేస్తున్న జర్నలిస్టులు, సిబ్బందికి తన శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement