ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచే ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన మేర జిల్లాలో వర్షాలు కురవలేదు. దీంతోపాటు జూన్, జూలై, ఆగస్టు నెలలన్నీ కూడా లోటు వర్షపాతమే నమోదైంది. దీంతో పంటల సాగు తగ్గింది. సెప్టెంబర్ నెలలో కురిసిన వర్షాలకు సుమారు 10 వేల హెక్టార్లలో సాగు విస్తీర్ణం పెరిగింది. ఇప్పటి వరకు 71 శాతం పంటల సాగు నమోదు అయింది. మరో 10 రోజుల్లో ఖరీఫ్ సీజన్ ముగియనుంది. రబీ సీజన్‌కు రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు సిద్ధం చేశాం.
– ఎం.పద్మావతి, జిల్లా వ్యవసాయ అధికారి


