సీన్ కట్ చేస్తే.. అదే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్‌ల పేరిట కొత్త వ్యవస్థను తీసుకొచ్చి భారీగా పంపకాలకు పూనుకుంది. భజన బృందానికి జనం డబ్బును వాడేందుకు సిద్ధమైంది. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో వలంటీర్లుగా పనిచేసిన వారు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. – సాక్షి నెట్‌వర్క్
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ విశేష సేవలందించి, ఇంటింటికీ సంక్షేమాన్ని పంచిన గ్రామ/వార్డు సచివాలయ వలంటీర్లను దారుణంగా అవమానించారు.. వైఎస్సార్ సీపీ ఏజెంట్లుగా ముద్రవేశారు.. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు.. నేడు వ్యవస్థనే లేకుండా చేశారు.
ఎన్నికల హామీలను తుంగలో తొక్కి కూటమి ప్రభుత్వం వలంటీర్లను నట్టేట ముంచింది. గౌరవ వేతనాన్ని పెంచుతామని చెప్పి తొలగించారు. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్లకు రూ.లక్షలు ఇవ్వడానికి మాత్రం వెనుకాడటం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి హామీ నిలుపుకోవాలి. ఉద్యోగ భద్రత కల్పించి విధుల్లోకి తీసుకోవాలి. ప్రజాధనాన్ని ప్రచారం కోసం దుర్వినియోగం చేయడం తగదు. సర్కారు తీరు మారకుంటే అసెంబ్లీని ముట్టడిస్తాం.
– డోలా స్వప్న, రాష్ట్ర కార్యదర్శి, గ్రామ–వార్డు వలంటీర్ల అసోసియేషన్, గుంటూరు
చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజాధనాన్ని ప్రచారాల పేరుతో పార్టీ కార్యకర్తలకు పంచిపెట్టేందుకు కుట్ర చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వలంటీర్లగా పనిచేసి రూ.5 వేల గౌరవ వేతనంలో అనేక ప్రజా సేవ కార్యక్రమాలలో పాలుపంచుకున్నాం. చంద్రబాబు గెలిచాక మమ్మల్ని పూర్తిగా విధుల నుంచి తొలగించడం బాధాకరం. ఇప్పుడు ఇన్‌ఫ్లూయెన్సర్ల పేరిట పార్టీ వారికి ప్రజాధనం దోచిపెట్టడానికి తెరతీయడం దారుణం. మాకు న్యాయం చేయాలి.
– రామలక్ష్మణుడు, మాజీ వలంటీరు, నగరం, బాపట్ల జిల్లా


