గాంధీజీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి ఆశయాలు ఆచరణీయం | - | Sakshi
Sakshi News home page

గాంధీజీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి ఆశయాలు ఆచరణీయం

Oct 3 2026 1:56 AM | Updated on Oct 3 2026 1:56 AM

వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో జయంతి వేడుకల్లో అంబటి

గుంటూరు ఎడ్యుకేషన్‌: జాతిపిత మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి ఆశయాలు, ఆదర్శాలు సదా ఆచరణీయమని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం బృందావన్‌గార్డెన్స్‌ రోడ్డులోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా వారికి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ సత్యం, అహింస ఆయుధాలుగా శాంతియుత మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ, జై జవాన్‌–జై కిసాన్‌ నినాదంతో గొప్ప పరిపాలన అందించిన లాల్‌బహదూర్‌ శాస్త్రి చిరస్మరణీయులని అన్నారు. వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షురాలు షేక్‌ నూరి ఫాతిమా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం సాగిస్తున్న గూండాయిజంపై గాంధేయ పద్ధతిలో అహింసామార్గంలో తాము పోరాటం చేస్తున్నామని అన్నారు. ఎప్పటికై నా సత్యం గెలుస్తుందని, తప్పుడు పాలనకు చరమగీతం పాడక తప్పదన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, తాడికొండ నియోజకర్గ సమన్వయకర్త వనమా డైమండ్‌ బాబులు కూడా గాంధీజీ, శాస్త్రి చిత్రపటాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగు నరసింహారావు, మైనార్టీ విభాగ జిల్లా అధ్యక్షుడు పఠాన్‌ సైదాఖాన్‌, అనుబంధ విభాగాల నాయకులు చింతపల్లి వెంకటరమణ, దానం వినోద్‌, నల్లమోతు రూత్‌రాణి, స్వర్ణలత, జి.ప్రభు, అచ్చాల వెంకట్‌రెడ్డి, దీపక్‌, సుందరరావు తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ సీఎం చంద్రబాబు బీసీ సామాజిక వర్గాలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్‌ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. శుక్రవారం గుంటూరులోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసీ కపట ప్రేమ చూపారని, తప్పుడు హామీలు ఇచ్చి మోసగించారని దుయ్యబట్టారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించాలంటే అందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. గతంలో కాపులకు నాలుగు శాతం రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు కాపు సామాజిక వర్గాన్ని మోసగించారని ఆరోపించారు. సర్‌ ప్రభావంతో రాష్ట్రంలోని 4.16 కోట్లలో 45 లక్షల ఓట్లు తొలగించారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను అక్రమాలకు తావు లేకుండా సర్‌ తర్వాతి జాబితా ప్రకారం నిర్వహించాలన్నారు. లేదంటే తొలగించిన ఓట్ల స్థానంలో టీడీపీ సర్కారు దొంగ ఓట్లు వేయించే ప్రమాదముందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement