మహిళా సాధికారతలో.. దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌! | In Women's Empowerment AP Is Number One In The Country | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతలో.. దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌!

Sep 26 2023 5:13 AM | Updated on Sep 26 2023 5:12 PM

In Women's Empowerment AP Is Number One In The Country - Sakshi

సాక్షి, అమరావతి: మహిళా సాధికారతలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్‌ చెప్పారు. శిశు, బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలన్నింటిలోనూ మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్‌ అమలు చేయిస్తున్నారని తెలిపారు. సోమవారం అసెంబ్లీలో మహిళా సాధికారతపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆమె సమాధానమిచ్చారు.

సంపూర్ణ పోషణ్, అమ్మ ఒడి, కల్యాణమస్తు, షాదీ తోఫా, చేయూత, ఆసరా, వృద్ధాప్య పెన్షన్లు తదితర పథకాలను అమలు చేయిస్తూ మహిళా సాధికారతను సీఎం జగన్‌ సాకా రం చేశారని కొనియాడారు. ఈ నాలుగేళ్లలో మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,53,862 కోట్లను వెచి్చంచిందన్నారు. జగనన్న అమ్మ ఒడికింద 44 లక్షల మంది తల్లులకు ప్రభుత్వం సాయం అందిస్తోందని తెలిపారు.

గతంలో చంద్రబాబు ప్రభుత్వ స్కూళ్లను మూసివేయిస్తే.. సీఎం జగన్‌ వాటన్నింటినీ తెరిపించడమేగాక, బాలికల కోసం ప్రత్యేకంగా స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేశారని చెప్పారు. చంద్రబాబు హయాంలో బాలికలకు కనీసం మరుగుదొడ్లు కూడా లేవని, ఇప్పుడు నాడు–నేడు కింద ప్రతి స్కూల్లో వారికోసం ప్రత్యేక మరుగుదొడ్లను నిర్మించామన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన కింద కోట్లాది రూపాయలు అందిస్తూ.. బాలికలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు.

పేద పిల్లలకు  పూర్తి రీయింబర్స్‌మెంట్‌ అందించడంతో పాటు వారిని నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అదే చంద్రబాబు.. విద్యార్థులకు నైపుణ్యం పేరిట ఇవ్వాల్సిన నిధుల్లో కుంభకోణం చేసి వాటిని స్వాహా చేశారన్న విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. డ్వాక్రా రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేయగా.. వైఎస్‌ జగన్‌.. డ్వాక్రా రుణమాఫీని నాలుగు దశల్లో చేసేలా నిధులు విడుదల చేయిస్తున్నారని తెలిపారు.

బ్యాంకులు, అమూల్‌ వంటి పరిశ్రమలు, ఇతర సంస్థలతో ఒప్పందాలు చేయిస్తూ మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా సీఎం జగన్‌ తీర్చిదిద్దుతున్నారని, సున్నా వడ్డీకి బాబు స్వస్తి పలికితే.. సీఎం జగన్‌ దానిని అమలు చేయడమే కాకుండా అధిక నిధులిస్తున్నారని మంత్రి వివరించారు. దా దాపు 30.76 లక్షల మంది మహిళల పేరిట ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని, జగనన్న శాశ్వ త భూ హక్కు ద్వారా మహిళలకు భూ హ క్కులు కలి్పంచామన్నారు. దిశ చట్టంతో పాటు, ప్రత్యేకంగా మహిళా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటుచేశామని మంత్రి ఉషా శ్రీచరణ్‌ వివరించారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం..
రాజ్యాంగానికి సవరణ చేస్తూ ‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు–2023’ను ఆమోదించిన భారత ప్రభుత్వానికి శాసనసభలో మంత్రి ఉషశ్రీ చరణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు–2023ను ఆమోదించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది.

మహిళలకు ఆరి్థకంగా, రాజకీయంగా సాధికారత కలి్పంచే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2019లో క్రియాశీలక చర్యలు తీసుకుంది. నామినేటెడ్‌ వర్క్స్‌ కాంట్రాక్టులు, సరీ్వస్‌ కాంట్రాక్టుల్లో మహిళలకు అవకాశం కలి్పంచేందుకు నామినేటెడ్‌ వర్క్స్‌లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించింది. పట్టణ, స్థానిక సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థలు, వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీల్లో అన్ని నామినేటెడ్‌ పోస్టుల్లో మహిళలకు 50 రిజర్వేషన్‌ కలి్పస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన క్రియాశీలక చర్యలను భారత ప్రభుత్వానికి తెలియచేస్తున్నాం’ అని మంత్రి ఉషశ్రీ చరణ్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement