వివాహేతర సంబంధం కోసం నన్ను వేధిస్తున్నాడు..! | woman alleges threat to life from husband complains to sp | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం కోసం నన్ను వేధిస్తున్నాడు..!

Jun 23 2026 2:07 PM | Updated on Jun 23 2026 2:19 PM

woman alleges threat to life from husband complains to sp

అన్నమయ్య జిల్లా: భర్త నుంచి ప్రాణహాని ఉందని ఓ యువతి  జిల్లా ఎస్పీ ధీరజ్‌కు ఫిర్యాదు చేసింది. రాయచోటి నియోజకవర్గం, లక్కిరెడ్డిపల్లి మండలం, మద్దిరేవుల పంచాయతీ, అప్పలరాజుగారి పల్లెకు చెందిన రామరాజు ట్రాన్స్‌కోలో కాంట్రాక్టు లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య ఎస్‌.లలిత ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందించింది. 2014లో తాను బిడ్డల్ని పుట్టినింటిలో వదిలి బతుకుదెరువు కోసం కువైట్‌ వెళ్లి 2019లో తిరిగి వచ్చానని తెలిపింది. 

ఆరు తులాల బంగారం, సుమారు 5 లక్షల నగదు భర్తకు ఇచ్చానని, అంతా వాడేసి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనపైనే నిందలు వేస్తున్నాడని ఆరోపించింది. భర్త రామరాజుతో పాటు అతని స్నేహితులు గజపతిరాజు, అంజితో కలిసి చంపడానికి కుట్ర పన్నారని వాపోయింది. భయంలో మూడు నెలల క్రితం కాకులారంలోని పుట్టింటికి వచ్చానని, అక్కడ కూడా దాడి చేసి వేధిస్తుండడంతో మదనపల్లెకు వచ్చి తలదాచు కుంటున్నా నని కన్నీటి పర్యంత మైంది. పోలీసులు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement