పతే ప్రత్యక్ష ‘దైవం’గా భావిస్తూ భర్తకు గుడి కట్టిన భార్య

Wife Build A Temple For Her Husband In Nimmavaram - Sakshi

సాక్షి, పొదిలి: కడదాక కలిసుంటానని బాస చేసిన భర్త అర్ధాంతరంగా తనువు చాలించడంతో భార్య తట్టుకోలేకపోయింది. భర్తను తలచుకుంటూనే కాలం వెళ్లదీస్తోంది. ఈ క్రమంలో భర్తను దైవంగా భావించే ఆమె ఏకంగా ఓ గుడికట్టించింది. నిత్యం పూజలందిస్తున్నది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం గ్రామానికి చెందిన అంకి రెడ్డి, పద్మావతి భార్యాభర్తలు. అంకిరెడ్డి నాలుగేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 

భర్త అంకిరెడ్డిని స్మరించుకుంటూ ఉంటోంది. భర్త మాదిరి పాలరాతి విగ్రహం చేయించి ప్రతిష్టించింది. నిత్యం పూజలు చేస్తూనే సమాజ సేవకులకు సన్మానిస్తున్నారు. భర్త స్నేహితుడు తిరుపతిరెడ్డి సహకారంతో కుమారుడు శివశంకర్‌ రెడ్డితో కలిసి ఆమె సేవలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి పౌర్ణమికి శని, ఆదివారాల్లో పేదలకు అన్నదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. అలా భర్తను సేవిస్తూ తన ప్రేమను చాటుకుంటోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top