3 Years Of YS Jagan Rule: అంబరం.. మూడేళ్ల సంబరం

The Welfare And Development Milestones Three Year YSRCP Regime - Sakshi

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: పాలనలో సమానత్వం.. ఇంటింటా నవరత్న వికాసం.. పల్లెల్లో ప్రగతి మంత్రం... మహిళల జీవితాల్లో ఆర్థిక వెలుగులు.. అర్హతే ప్రామాణికంగా పథకాల అమలు... సచివాలయ వ్యవస్థతో ఇంటి ముగింటకే సంక్షేమ పథకాలు... నాడు–నేడు అనేలా మారిన బడుల రూపురేఖలు.. అన్నదాతకు భరోసాతో వ్యవ‘సాయం’... విద్యారంగంలో సంస్కరణల విప్లవం... పారిశామ్రిక పురోగతి దిశగా అడుగులు.. ఇలా ఒకటేమిటి మూడేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో సంక్షేమ, అభివృద్ధి మైలు రాళ్లు ఎన్నో కనిపిస్తాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం సంబరాలు మిన్నంటాయి.  

  • కళ్యాణదుర్గం మండలం చాపిరిలో మంత్రి ఉషశ్రీచరణ్‌ కేక్‌కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. అంతకు ముందు  దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.
  • రాయదుర్గంలోని వినాయక్‌ సర్కిల్‌లో ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్డు పంపిణీ చేశారు. అనంతపురంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, మేయర్‌ మహమ్మద్‌ వసీంసలీం తదితరులు పాల్గొన్నారు.  
  • శింగనమల నియోజకవర్గం నార్పల మండలం మద్దలపల్లిలో వైఎస్సార్‌ విగ్రహానికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు హాజరయ్యారు.  
  • ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి పంచారు.  
  • రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో వైస్‌ ఎంపీపీ రామాంజినేయులు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.  
  • తాడిపత్రిలోని పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్‌ కేతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. 

(చదవండి: సామాజిక న్యాయం 'దశ దిశలా'.. )

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top