
ఇంకొల్లు (చినగంజాం): బాపట్ల జిల్లా ఇంకొల్లులోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహంలోని టాయిలెట్ గదిలో వాటర్ ప్యూరిఫయర్‌ను బిగించడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. టాయిలెట్‌లో ఎవరైనా వాటర్ ప్యూరిఫయర్‌ను బిగిస్తారా.. అంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీసీ జిల్లా అధికారి హాస్టల్‌ను సందర్శించి వాటర్ ఫ్యూరిఫయర్‌ను అక్కడి నుంచి తొలగించి, మరో చోట బిగించాలని ఆదేశించారు.
ఈ విషయమై హాస్టల్ వార్డెన్ రామాంజనేయులు మాట్లాడుతూ.. నీటి ట్యాంక్ ఆ గదిపైనే ఉన్నందున తొలుత అక్కడ బిగించామని చెప్పారు. అయినా ఈ నీరు పిల్లలు తాగేందుకు కాదని, తాము పిల్లల కోసం మినరల్ వాటర్ క్యాన్లు తెప్పిస్తున్నామని చెప్పారు. వంట గదిపైన వాటర్ ట్యాంక్ బిగించిన తర్వాత.. ప్యూరిఫయర్‌ను ఆ గదిలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.